కొండ దొర” ట్రైబల్ ప్రొడక్ట్స్ కు స్వాగతం మా వద్ద ఉన్న 100% స్వచ్ఛమైన గిరిజన ఉత్పత్తులు మీకు అందించుటకు సంతోషిస్తున్నాము.

మా గిరిజన ప్రాంతమైన అరకు,లంబసింగి,పాడేరు, చింతపల్లి, మారేడిమిల్లు మొదలైన గిరిజన ప్రాంతాలలో పండే స్వచ్ఛమైన గిరిజన ఉత్పత్తులు మా “కొండ దొర ట్రైబల్ ప్రొడక్ట్స్” ద్వారా మీకు అందించాలని మా ప్రధానమైన ఆశయం.

మేము ప్రధానంగా గిరిజనుల సంప్రదాయాలను, జీవన విధానాన్ని ప్రోత్సహిస్తూ, వారి చేతిలో తయారైన శుద్ధమైన మరియు ఆరోగ్యకరమైన ఉత్పత్తులను మీకు అందిస్తున్నాం.

మా లక్ష్యం :- సహజసిద్ధమైన, రసాయనరహిత, ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ప్రతి ఇంటికి చేరవేయడం మా ప్రధాన లక్ష్యం. స్థానిక గిరిజన రైతులను, చేతివృత్తులను ప్రోత్సహిస్తూ, వారి జీవనోపాధికి తోడ్పడే ప్రయత్నం చేస్తున్నాం.

మా ఉత్పత్తులు:- ప్రతి సీజన్ లో దొరికే పండ్లు,కూరగాయలు,చిరుధాన్యాలు,కాఫీ,తేనే,మొదలైన అనేక గిరిజనులు పండించే ఉత్పత్తులు

మేము ఎందుకు ప్రత్యేకం?

✅ స్వచ్ఛమైన, ఒరిజినల్ ట్రైబల్ ఉత్పత్తులు

✅ ఏ రసాయనాలు, కల్తీ పదార్థాలు లేని నేచురల్ ప్రొడక్ట్స్

✅ గిరిజనుల ఆర్థికాభివృద్ధికి మద్దతుగా ప్రత్యక్షంగా వారికి లాభం వచ్చే విధంగా పని చేయడం

✅ కస్టమర్ల ఆరోగ్యాన్ని, బలాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యతతో కూడిన ఉత్పత్తులను అందించడం